మండల ఎంపిడిఓ క్రాంతికుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామాల్లో పేరుకపోయిన పలు సమస్యల పరిస్కారం కోసమే గ్రామ సభలను ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లుగా మండల ఎంపిడిఓ క్రాంతికుమార్ తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు మల్లారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య అధ్యక్షతన శనివారం గ్రామసభ నిర్వహించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి చేయుత పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు తదితర ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. రాబోయే వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహహన, జల సంరక్షణ, వ్యవసాయ ఇతరత్రా అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీజ, ఏపిఎం హనుమంతరావు, ఇరిగేషన్, విద్యుత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి చెలుకల రాజు యాదవ్, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసమే గ్రామసభలు
- Advertisement -
- Advertisement -



