Friday, August 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామపంచాయతీలకు 'షాక్'!

గ్రామపంచాయతీలకు ‘షాక్’!

- Advertisement -

15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై సర్పంచ్లు ఆందోళన
నవతెలంగాణ – మల్హర్ రావు

కేంద్రం నుంచి విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ బకాయిలకు జమ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలపై మండలంలోని సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిధుల కొరతతో సతమతమవుతున్న పంచాయతీలకు, వచ్చిన నిధులను విద్యుత్ బిల్లులు చెల్లించాలనడంతో అత్యవసర పనులకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మండల పరిధిలో మొత్తం 15 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గత కొంతకాలంగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆయా పంచాయతీల పరిధిలో సుమారు రూ.20 లక్షల వరకు విద్యుత్ బకాయిలు పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

సర్పంచ్ల ఎన్నికలు పూర్తి కాకపోవడంతో గతంలో ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదు.అయితే గత ఏడు నెలల క్రితం నూతన సర్పంచ్లు అధికారంలోకి రావడంతో కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు పెండింగ్ నిధులను విడుదల చేసింది. ఈ క్రమంలో ఇటీవల 15వ ఆర్థిక సంఘం త్రైమాసిక నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ నిధులతో గ్రామాభివృద్ధి పనులు,ఇతర అవస రాలు తీర్చుకుందామని సర్పంచ్లు భావించారు. కానీ, ప్రభుత్వం ఈ నిధులను వెంటనే పెండింగ్ విద్యుత్ బకాయిలకు మళ్లించాలని ఆదేశాలు జారీ చేయడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్రస్తుతం స్టేట్ ఫైనాన్స్ నిధులు రాకపోవడం, ఉన్న కేంద్ర నిధులను విద్యుత్ బిల్లులకు జమ చేయాల్సి రావడం వల్ల తాగునీటి అవసరాలు, పారిశుద్ధ్య పనులు, కార్మికుల వేతనాలు, బ్లీచింగ్ పౌడర్ ల కొనుగోలు, ట్రాక్టర్ల డీజిల్ ఖర్చులకు నిధులు లేక పంచాయతీ నిర్వహణ భారంగా మారింది. ఈ సమస్యపై ఆయా గ్రామాల సర్పంచ్లు స్పందించి, విద్యుత్ బకాయిలను ఒకేసారి కాకుండా వాయిదా పద్ధతిలో చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పలువురు సర్పంచ్లు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -