Wednesday, September 16, 2026
E-PAPER
Homeజిల్లాలుసాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ

సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ

- Advertisement -

​- సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి

నవతెలంగాణ-నెల్లికుదురు: తెలంగాణ సాయుధ పోరాటంలో కొండపల్లి గోపాలరావు, చిర్ర లింగయ్య, వరిపళ్లి నరసయ్య పాత్ర గొప్పదని  వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని బ్రాహ్మణ, కొత్తపల్లి, నైనాల, నెల్లికుదురు, మునిగలవీడులో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్తూపాల వద్ద వారికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ముఖ్యఅతిథిగా  విజయసారథి హాజరై మాట్లాడుతూ… నెల్లికుదురు ప్రాంతంలో నాడు నిజాం రాజును గడగడలాడించిన యోధులు కొండపల్లి గోపాలరావు, వరిపల్లి నరసయ్య, చిర్రా లింగయ్య, సీతారామయ్య నేతలేనని అన్నారు.

ఈ ప్రాంతంలో 300 మంది అమరులైనట్టు గుర్తు చేశారు.  తెలంగాణ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం కావడంలో  సీపీఐ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. సాయుధ పోరాటంలో నెల్లికుదురు  కీలక పాత్ర పోషించింది అన్నారు. బీజేపీకి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధం లేదని, బీజేపీ ఉద్యమాన్ని వక్రీకరిస్తుందని ఆరోపించారు. సాయిధ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం  సెప్టెంబర్ 17న అధికారికంగా  నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ వరి పల్లి వెంకన్న, మండల కార్యదర్శి బైస స్వామి , మండల సహాయ కార్యదర్శులుగా చిరా సత్యనారాయణ, తూటి వెంకటరెడ్డి, నాయకులు చిర్రా వెంకన్న, వర్రె వెంకన్న ,ఆకుల శివ , చింతకుంట్ల సైదులు, తాళ్ల ఉప్పలయ్య, తాజుద్దీన్ , ఉప్పరబోయిన లక్ష్మణ్,  నేతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -