- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడలో ఏర్పాటు చేసిన అతిపెద్ద వినాయకుడి మట్టి విగ్రహం ప్రపంచ రికార్డు సాధించింది. డూండీ గణేశ సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని విద్యాధరపురం సితార గ్రౌండ్స్‌లో 72 అడుగుల ఎత్తయిన శ్రీపంచముఖ వరసిద్ధి మహా గణపతి మట్టి విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహం ఎత్తయిన పర్యావరణ హిత గణేశుడిగా.. ఇంజీనియస్ ఛార్మ్ వరల్డ్ రికార్డ్ (ఐసీడబ్ల్యూఆర్) సాధించింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) చేతుల మీదుగా ఈ రికార్డును నిర్వాహకులకు బుధవారం అందజేశారు. ఈ మట్టి విగ్రహాన్ని నిలబెట్టినచోటే నిమజ్జనం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమితి వ్యవస్థాపకుడు రాకేష్ వెల్లడించారు.
- Advertisement -



