- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ (విమాన ఇంధనం) ఎగుమతి సుంకాలను (లెవీలను) కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. డీజిల్‌పై లీటరుకు రూ.5, పెట్రోల్‌పై రూ.1, ఏటీఎఫ్‌పై రూ.4 చొప్పున కోత విధించింది. అయితే ఈ మార్పులు ఎగుమతులకే వర్తిస్తాయని, దేశీయంగా బంకుల్లో విక్రయించే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి రెండు వారాలకు ఒకసారి ఈ సుంకాలను కేంద్రం సమీక్షిస్తుంటుంది.
- Advertisement -


