- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బిహార్ రాజధాని పట్నాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్నాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకోవడంపై కోపోద్రిక్తులైన ఆందోళనకారులు 3 పోలీసు జీపులకు నిప్పుపెట్టడంతో పాటు, వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. మృతదేహాన్ని తరలించిన పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. దాడులకు పాల్పడినవారిని వీడియోల ఆధారంగా గుర్తిస్తామన్నారు.
- Advertisement -


