హెచ్.టీ సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై హేమల్ తుమ్మపూడి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న తొలి చిత్రం ‘పాటకు ప్రాణం’. ఈ సినిమా బుధవారం ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకులు సురేందర్ రెడ్డి, హీరో నిఖిల్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సంగీతానికి, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కనున్న ఈ చిత్రంలో సుదర్శన్, సాత్విక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానుందని దర్శక, నిర్మాత హేమల్ తుమ్మపూడి తెలిపారు. వైవిధ్యమైన కథాంశంతో, సంగీతానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమంలో, దర్శకుడు హేమల్ తుమ్మపూడి మాట్లాడుతూ , “ముందుగా మా లాంటి యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హీరో నిఖిల్ గారికి, దర్శకుడు సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మా చిత్రబృందాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన నటీనటులందరికీ ధన్యవాదాలు.
సుమారు 60 ఏళ్లుగా వెనుకబడిపోయిన రామయ్య అనే వ్యక్తి, అలాగే 20 ఏళ్ల యువకుడు కలిసి ప్రారంభించే మ్యూజికల్ జర్నీ చుట్టూ మా సినిమా కథ సాగుతుంది. ఇది న్యూ ఏజ్ మ్యూజికల్ డ్రామా. సినిమాలో చాలా పాటలు ఉంటాయి. మా చిత్రానికి శేఖర్ చంద్ర అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మంచి తేదీని చూసుకుని థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.తనికెళ్ల భరణి గారు మాట్లాడుతూ ,’ఈ సినిమాను ‘శంకరాభరణం’తో పోల్చడం లేదు. అయితే ఆ సినిమాలో ఉన్న సంగీత స్ఫూర్తి ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఒక పాత తరం సంప్రదాయ సంగీత విద్వాంసుడికి, ఈ తరం జెన్-జెడ్ సంగీతకారుడికి మధ్య ఉండే ఆసక్తికరమైన కలయికను చూపించబోతున్నారు’ అని అన్నారు.
హీరో సుధర్శన్ వంగల మాట్లాడుతూ,’ఈ సినిమాలో నేను అరుణ్ అనే పాత్రలో నటిస్తున్నాను. ఇంతమంది ప్రతిభావంతులైన నటీనటులతో కలిసి ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి మ్యూజికల్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి’ అని చెప్పారు. హీరోయిన్ సాత్విక మాట్లాడుతూ,’ ఈ సినిమాలో నేను రాధ పాత్రలో నటిస్తున్నాను. అరుణ్ జీవిత ప్రయాణంలో రాధ పాత్ర కూడా ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది’ అని తెలిపారు. నిర్మాత శ్రీరామ్ తుమ్మపూడి మాట్లాడుతూ,:’మా సినిమాకు మీ అందరి సహకారం, ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను’ అని చెప్పారు.సుదర్శన్, సాత్విక,తనికెళ్ల భరణి,రాజీవ్ కనకాల, అనితా చౌదరి, రఘు కారుమంచి, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్: సి.ఆర్. చక్రవర్తి, ఛాయాగ్రహణం: సంజీత్ సింగ్, కూర్పు: ప్రభాత్ రెడ్డి బండ, సంగీతం: శేఖర్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబీ రెడ్డి.
న్యూ ఏజ్ మ్యూజికల్ ఫిల్మ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



