Wednesday, September 16, 2026
E-PAPER
Homeఆటలుఈక్వెస్ట్రియన్‌ ‌పోటీలకు ఆదరణ

ఈక్వెస్ట్రియన్‌ ‌పోటీలకు ఆదరణ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఎన్‌ఏఎస్‌ఆర్‌ ‌పోలో,ఈక్వెస్ట్రియన్‌ అకాడమీలో నిర్వహించిన ‌భారత ఈక్వెస్ట్రియన్‌ ‌సమాఖ్య జాతీయ క్వాలిఫయర్‌ ‌పోటీలకు విశేష ఆదరణ లభించందని నిర్వాహకులు తెలిపారు. 11 పోలో క్లబ్‌‌లు, అకాడమీల నుంచి రికార్డు 50 మంది హార్స్‌ ‌రైడర్లు పోటీపడ్డారు. క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌‌లో ఐజా మిర్‌, నజముద్దీన్‌ ఆజామ్‌, ప్రభునూర్‌ ‌సింగ్‌ ‌మదన్‌, ధ్రువ పోతినేని, సిద్ధార్థ దత్తా, సంయుక్తం వానపల్లి, గూడూరి వేదిక్‌, అయాన్‌ ‌వర్మ నడింపల్లి, మహ్మద్‌ ఆమీర్‌ ‌షానవాజ్‌, మేఘ్‌ ‌వాహ్ని దొంతిరెడ్డి ఆకట్టుకున్నారు. పోటీల అనంతరం డా. కెసిఎస్‌ ‌రెడ్డి, కల్నల్‌ ‌నంద, కల్నల్‌ ‌యాదవ్‌‌లు వెటర్నరీ తనిఖీ నిర్వహించి పోటీల్లో పాల్గొనేందుకు హార్స్‌‌లు ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్‌ఏఎస్‌ఆర్‌ ‌పోలో, ఈక్వెస్ట్రియన్‌ అకాడమీ సీఈవో మీర్‌ ‌జమాలుద్దీన్‌, ఎగ్జిక్యూటివ్‌ ‌బోర్డు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -