Wednesday, September 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభిన్న ప్రేమ కథ..

భిన్న ప్రేమ కథ..

- Advertisement -

వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న రా అండ్ రస్టిక్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టి.ఆర్. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఈనెల 18న ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశ్వక్ సేన్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ,’నేను ఈ వేడుకకు రావడానికి కారణం డైరెక్టర్ తుకారాం. ‘ఫలక్‌నుమా దాస్’ అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని కాస్టింగ్ కాల్ పెట్టాను. అప్పుడు వచ్చిన డైరెక్టర్ తుకారాం. తనకి ఇష్టమైన సినిమా ‘ఒసేయ్ రాములమ్మ’ అని చెప్పాడు. నిజంగా అలాంటి ఆన్సర్ నేను ఎవరి దగ్గర వినలేదు. తర్వాత కొంతకాలం పని చేశాక తను సొంతగా డైరెక్టర్ చేసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడని నాకు అర్థమై, తన ప్రయత్నాలు చేసుకోమని పంపించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా జర్నీ కొనసాగుతుంది. నా సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ ఏది రిలీజ్ అయినా మొదట తన నుంచే కాల్ వస్తుంది.

తను చాలా మొండివాడు. ఈ సినిమా టైటిల్ డిజైన్‌లో కూడా తన పట్టుదల కనిపిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. అలాగే తనకి సపోర్ట్ చేసిన నిర్మాతలకు కూడా ధన్యవాదాలు. సినిమా చేయడానికి చాలా ప్యాషన్ కావాలి. అలాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతలు దొరకడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి నిర్మాతలు గెలవాలని కోరుకుంటున్నాను. నాకు అయినంత సపోర్ట్ ఈ సినిమాకి చేయాలని ఉంది. నా వంతుగా మొదటి రోజు వెయ్యి టికెట్లు కొనుగోలు చేస్తాను’ అని తెలిపారు. ప్రొడ్యూసర్ కీర్తన మాట్లాడుతూ,’ఈ నెల 18న సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది. అందరికీ నచ్చుతుంది. తప్పకుండా చూస్తారని భావిస్తున్నాను. విశ్వక్ సపోర్ట్‌ని మర్చిపోలేను. డైరెక్టర్‌ చాలా అద్భుతమైన సినిమా తీశారు’ అని అన్నారు.డైరెక్టర్ తుకారాం మాట్లాడుతూ,’ విశ్వక్ నమ్మిన వారి వెంట నిలబడతారు. దానికి ఉదాహరణ ఇదే. మా నిర్మాతలు లేకపోతే మేము ఇక్కడ వరకు వచ్చేవాళ్లం కాదు’ అని చెప్పారు.
నిర్మాత అంజనప్ప మాట్లాడుతూ,’ ఈకథ చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ థియేటర్‌లో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -