– కామారెడ్డి పట్టణ సిఐ నరహరి
నవతెలంగాణ – కామారెడ్డి
నవతెలంగాణ దినపత్రిక 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా యాజమాన్యానికి, సంపాదక వర్గానికి, విలేకరులకు, సిబ్బందికి కామారెడ్డి పట్టణ సీఐ నరహరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న చిన్న సమస్యలు, క్షణికావేశాలు, భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, ఇలాంటి సమయాల్లో ప్రతి ఒక్కరూ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు.
ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదనీ, మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలతో కుటుంబాలు, పిల్లల జీవితాలు రోడ్డున పడతాయని, బాధ్యతాయుతమైన ఆలోచనలతోనే కుటుంబాలు, వ్యవస్థ బాగుంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, బాధ్యతాయుతమైన వార్తలు, కథనాలతో సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్న నవతెలంగాణ దినపత్రిక సేవలు అభినందనీయమన్నారు. ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తూ సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో నవతెలంగాణ ప్రత్యేక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే ప్రజాసేవా స్ఫూర్తితో నవతెలంగాణ దినపత్రిక ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.



