- Advertisement -
- అంతర్ రాష్ట్ర లేండి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి అసెంబ్లీలో గాలం విప్పిన ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు
నవతెలంగాణ-మద్నూర్: ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు రైతుల తరఫున గళం ఎత్తారు.జుక్కల్ నియోజకవర్గంలో బొప్పాయి వివిధ రకాల ఉద్యానవన పంటలను రైతులు విస్తారంగా సాగు చేస్తున్నారు. అన్నదాతలకు అండగా నిలిచేందుకు, అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ యూనిట్లుగ్రేడింగ్ & ప్యాకింగ్ కేంద్రాలుమెరుగైన మార్కెట్ సదుపాయాలు వెంటనే కల్పించాలని అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పాటు, నియోజకవర్గానికి ఎంతో కీలకమైన అంతర్ రాష్ట్ర లెండి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి సంబంధిత మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -



