నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని హంగర్గ గ్రామంలోని సన్షైన్ స్కూల్‌లో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ముఖ్యంగా పోతరాజు వేషధారణలో విద్యార్థులు చేసిన ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి విద్యాసంస్థ బాధ్యత అని అన్నారు. విద్యార్థులు పండుగల ఆచారాలు, విశిష్టతను తెలుసుకుని వాటిని ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ పాటిల్, ప్రిన్సిపాల్ అశోక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నారు.
సన్ షైన్ స్కూల్‌లో ఘనంగా బోనాల వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



