Thursday, September 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనైజీరియాలో విషాదం..కలుషిత పానీయం తాగి 48 మంది మృతి

నైజీరియాలో విషాదం..కలుషిత పానీయం తాగి 48 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దక్షిణ నైజీరియాలోని ఒండో రాష్ట్రంలో కలుషిత పానీయం సేవించి కనీసం 48 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఒడిగ్బో, ఇరెలే ప్రాంతాల్లో ఈ ఘటనలు నమోదయ్యాయి. మిథనాల్‌ ఉన్నట్లు అనుమానిస్తున్న పానీయం తాగడంతో మూత్రపిండాలు, కళ్లు, మెదడుపై తీవ్ర ప్రభావం పడినట్లు ఆరోగ్యశాఖ కమిషనర్‌ బంజి అజాకా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 15 మందిని అరెస్ట్‌ చేశారు. వారిలో ఒకరు మిథనాల్‌ కలిసిన మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు రెండు వారాల క్రితం తొలి మరణం నమోదైనట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -