జిల్లా కోఆర్డినేటర్ శివప్రసాద్
నవతెలంగాణ-అచ్చంపేట
పాఠశాలకు వెళ్ళలేకపోయిన వారికి, మధ్యలో చదువు ఆపేసిన వారికి వయోజనులకు దూర విద్య ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు చదువుకోవడానికి ఎలాంటి ఫైన్ ఫీజు లేకుండా ఈ నెల 30 వరకు అడ్మిషన్లు పొందవచ్చుని నాగర్ కర్నూల్ జిల్లా ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ శివప్రసాద్ బుధవారం నవతెలంగాణతో తెలిపారు. ఈ అవకాశాన్ని చదువుకోవాలని ఆసక్తి ఉన్న యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో 16 ఓపెన్ స్కూల్ సెంటర్లు ఉన్నాయి. 10వ తరగతిలో 258 మంది, ఇంటర్మీడియట్ లో సైన్స్ కోర్సులో 205, ఇతర కోర్సులలో 472 మొత్తం పదవ తరగతి ఇంటర్మీడియట్ లలో 935 మంది అడ్మిషన్ అయినట్లు కోఆర్డినేటర్ తెలిపారు.
ఓపెన్ స్కూల్ అవకాశాన్ని స్వధినియోగం చేసుకోవాలి: శివ ప్రసాద్ జిల్లా కోఆర్డినేటర్
కుటుంబ ఆర్థిక పరిస్థితులు తదితర కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకొని జీవితాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 30వ తారీఖు వరకు అడ్మిషన్లు పొందటానికి ఓపెన్ స్కూల్ రాష్ట్ర డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.



