Friday, August 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టీలైజర్ సేల్ యాప్, పంటలపై అవగాహన

ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టీలైజర్ సేల్ యాప్, పంటలపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ యాప్ పైన మండల వ్వ్యయవసాయ అధికారి రాజు ఆధ్వర్యంలో వసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ రైతు సోదరులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ఫామ్ పాండ్, ఆయిల్ పామ్ మొక్కల పెంపకం పైన రైతులకు సూచనలు చేశారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ శకుంతల బాలు, రైతు సోదరులు లక్షెట్టి రాములు, పట్వారీ గంగాధర్, మెగొండ ఖండుగొండ ,రమేష్, గొల్ల గంగాధర్, గ్రామ సెక్రటరీ జీవన్, పాల్గొన్నారు. అదేవిధంగా రైతులకు ముఖ్య సమాచారం – ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ (FFS) మొబైల్ యాప్ అమలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, వేగవంతంగా మరియు సులభతరం చేయడానికి ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ ఎఫ్ ఎఫ్ ఎస్ (FFS) మొబైల్ యాప్‌ను ఈ రోజు నుండి అమల్లోకి తీసుకువచ్చింది.

ఈ యాప్ ద్వారా రైతులు తమ మొబైల్‌లోనే ఎరువులను బుక్ చేసుకునే అవకాశం కల్పించబడింది. బుకింగ్ పూర్తయ్యాక రూపొందిన QR కోడ్‌ను ఎరువుల దుకాణంలోని ePOS యంత్రంలో స్కాన్ చేసి ఎరువులను పొందవచ్చు. రైతులకు సూచనలు: గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుండి (Framework for Fertilizer Sale) (FFS) ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆధార్ నంబర్‌తో ఓటిపి ( OTP ) ద్వారా నమోదు చేసుకోవాలి. భూమి వివరాలను ఎంపిక చేసి అవసరమైన ఎరువులను బుక్ చేసుకోవాలి. వచ్చిన QR కోడ్‌ను డీలర్‌కు చూపించి ePOS యంత్రం ద్వారా ఎరువులు పొందాలి.

ఎరువుల డీలర్లకు సూచనలు:

యాప్ తెలియని రైతులకు యాప్ ఇన్‌స్టాల్ చేసి బుకింగ్ చేయడంలో సహాయం చేయాలి.
రైతులకు MRP కంటే ఎక్కువ ధరకు ఎరువులు విక్రయించరాదు.
ఎరువుల పంపిణీని తప్పనిసరిగా ఈ పాస్ ( ePOS) యంత్రం ద్వారా మాత్రమే నిర్వహించాలి.
ఈ కొత్త విధానం ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు సమయం ఆదా అవుతుంది. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -