జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసిన సీసీఎల్‌ఏ : టీజీజేఏసీ చైర్మెన్ లచ్చిరెడ్డి హర్షం వ్యక్తం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూనియర్ అసిస్టెంట్ల సర్వీసు క్రమబద్దీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది. వారి సర్వీసు క్రమబద్దీకరణపై కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. జూనియర్ అసిస్టెంట్ల నియామకం జరిగి రెండేండ్లు గడిచినా ఇప్పటి వరకు సర్వీసు క్రమబద్దీకరణపై స్పష్టత లేదు. వారి క్రమబద్ధీకరణపై రెండేండ్లుగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీతో పాటు పలు సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ క్రమంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీ ద్వారా నియామకం అయిన జూనియర్ అసిస్టెంట్ కేడర్‌కు తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1996 యొక్క రూల్ నెం.16 (సీ) (ఐఐ) వర్తిస్తుందని మార్గదర్శకాల్లో తెలియజేశారు. బదిలీ ద్వారా నియామకం కాబడిన ఉద్యోగులకు ఒక సంవత్సరం ప్రొబేషన్ ఉంటుందని కలెక్టర్లకు జారీ చేసిన ఆదేశాలలో స్పష్టంగా తెలిపారు.
ఉద్యోగుల జేఏసీ హర్షం
జూనియర్ అసిస్టెంట్ల సర్వీసు క్రమబద్దీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇవ్వడం పట్ల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి, డీసీఏ జనరల్ సెక్రటరీ కెతావత్ రామకృష్ణ, టీజీటీఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, టీజీఆర్‌ఎస్‌ఏ అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి వి.బిక్షం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్‌కుమార్, సెక్రటరీ మంద మకరందు ప్రత్యేక చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు.
జూనియర్ అసిస్టెంట్ల సర్వీస్ క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES