Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రీన్‌ ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూ నిర్వాసితుల సమావేశం

గ్రీన్‌ ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూ నిర్వాసితుల సమావేశం

- Advertisement -

“ఒకే రేటు పరిహారం ఇవ్వకపోతే భూములే ఇవ్వం” — ఎక్వయిపల్లి, మర్రిపల్లి రైతుల హెచ్చరిక
ఎంపీ ఎమ్మెల్యేకు రైతులు వినతి పత్రం అందజేత 
నవతెలంగాణ –  కడ్తాల్

కడ్తాల్ మండల పరిధిలో గ్రీన్‌ ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణానికి సంబంధించి నిర్వహించిన భూ నిర్వాసితుల సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా ఎక్కువైపల్లి, మర్రిపల్లి గ్రామాల రైతులు తమ సమస్యలను తేటతెల్లంగా వెల్లడించారు.

రైతులు మాట్లాడుతూ.. “మీకాన్‌పేట్‌ ప్రాంతంలో ఎలా ఒకే రేటుతో నష్టపరిహారం చెల్లించారో, మాకు కూడా అదే రీతిలో పరిహారం ఇవ్వాలి. జిల్లా వ్యాప్తంగా  ఎక్కడైనా భూమి నష్టం ఒకటే… కానీ రేట్లు వేరేలా ఎలా పెడతారు? సరైన పరిహారం ఇవ్వకపోతే భూములు ఇవ్వం” అని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, తహసిల్దార్, ఎంపీడీవో, పాల్గొన్నారు.

ఎమ్మెల్యే, ఎంపీ కలిసి మాట్లాడుతూ..“తెలంగాణ ప్రభుత్వం నిజమైన ప్రజా ప్రభుత్వం. ప్రజల సంక్షేమానికి, అన్ని వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వం. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం తీసుకొస్తాం” అని హామీ ఇచ్చారు. అనంతరం ఎక్వయిపల్లి గ్రామానికి పలు అభివృద్ధి పనుల నిర్మాణానికి ముదిరాజ్ సంఘం భవన్ నిర్మాణానికి రూ.5 లక్షలు, ఎస్సీ కమిటీ హాల్ ప్రహరి గోడ నిర్మాణానికి మరో ₹5 లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఇందిరానగర్ తండా ఉన్న భూమిని గ్రామ కంఠం రిజిస్ట్రేషన్ చేయాలని ఆర్డీవోకు సూచించినట్లు తెలిపారు.

రైతుల అభ్యర్థనలను పూర్తిగా పరిశీలించి న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  ఏఎంసీ చైర్మన్ యాట గీతా నరసింహ,వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, పీసీసి సభ్యులు ఆయిల శ్రీనివాస్ గౌడ్, జోగు వీరయ్య, యాట నరసింహ, రవి కాంత్ గౌడ్, గౌరయ్య,సుమన్, శంకరయ్య,వెంకటేష్, అన్నేపు జంగయ్య, నారాయణ రెడ్డి, లక్ష్మణ్ తదితర రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -