Friday, April 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅరుణాచల్‌ ప్రదేశ్‌ మిజోరాం ప్రజలకు శుభాకాంక్షలు

అరుణాచల్‌ ప్రదేశ్‌ మిజోరాం ప్రజలకు శుభాకాంక్షలు

- Advertisement -

గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరాం ప్రజలకు తెలంగాణ గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ ఆ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో ఆ రాష్ట్రాల అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ఆ రాష్ట్రాల సాధికారత, సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు సాగిన ప్రయాణాన్ని వివరించారు. అరూణాచల్‌ ప్రదేశ్‌, మిజోరాం రాష్ట్రాల సాంస్కృతిక వైభవం, సహజ సౌందర్యం, సంప్రదాయాలను ఆయన కొనియాడారు. ”ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ భారత్‌” కార్యక్రమం ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించడంలో రాష్ట్రాలు కీలక పాత్రను పోషిస్తున్నాయని ప్రశంసించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరాం రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, కళాకారులు సాంప్రదాయిక నృత్య ప్రదర్శనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ రెండు రాష్ట్రాల గవర్నర్ల వీడియో సందేశాలను వినిపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -