- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి లు పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా, విజయవంతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా ఇలాంటి గొడవలకు తావివ్వరాదని సూచించారు.
- Advertisement -