Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీపై బూడిద మేఘాలు

ఢిల్లీపై బూడిద మేఘాలు

- Advertisement -

వర్క్‌ఫ్రం హౌం ప్రకటించిన సర్కార్‌
విమాన రాకపోకలకు అంతరాయం
ఆందోళన అక్కర్లేదు: పౌరవిమానయాన శాఖ
న్యూఢిల్లీ:
ఆఫ్రికాలోని ఇథియోపియా లో హేలీ గుబ్బి అగ్నిపర్వతం పేలడంతో..దాని తాలుకు బూడిద మేఘా లు భారత్‌ వైపు కదిలొచ్చాయి. ఇవి గుజరాత్‌, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు విస్తరించాయి.ఈ మేఘాలు భారత గగన తలం దాటిపోయే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. చైనా దిశగా కదులుతున్నట్టు తెలిపారు.

విమాన సర్వీసులపై ప్రభావం
బూడిద మేఘాలతో విమాన సర్వీసులకు అంతరాయం కలగడంపై పౌరవిమానయానశాఖ స్పందించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విమాన కార్యకలాపాలు సజావుగానే సాగుతున్నట్టు వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని విమానాలను దారిమళ్లించినట్టు తెలిపింది. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే వాయుకాలుష్యంతో నిండిన దేశ రాజధాని ఢిల్లీని ఈ బూడిద మేఘాలు భయపెట్టాయి. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే వర్క్‌ఫ్రంహౌం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -