- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రతి గురువారం ప్రజలకు అందుబాటులో ఉంటూ, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తూ, సమస్యలను పరిష్కరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం గ్రీవెన్స్ లో భాగంగా కలెక్టర్ ఛాంబర్ లో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మోత్కూరు మండలం అనాజీపురం గ్రామంలోని బుడగ జంగాల కాలనీ వాసులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడంతో మోత్కూరు ఎంపీడీఓ కి కలెక్టర్ గారు ఫోన్ చేసి ఎంక్వయిరీ చేసి తదుపరి లిస్ట్ లో పెట్టమని ఆదేశించారు.
- Advertisement -