Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఅగ్ని ప్రమాదంలో కిరాణం షాపు బుగ్గి.!

అగ్ని ప్రమాదంలో కిరాణం షాపు బుగ్గి.!

- Advertisement -

రూ.5.28 లక్షల ఆస్తి నష్టం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు..
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన అయిత శ్రీనాథ్ కు చెందిన కిరాణం షాపు ప్రమాదవశాత్తు మంగళవారం రాత్రి 11.40 లకు అగ్ని ప్రమాదంలో బుగ్గి పాలైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కళ్ళ ముందే కిరాణం అగ్గి ప్రమాదంలో బుగ్గిపాలు కావడంతో బాధిత కుటుంబం రాత్రి కన్నీరుమున్నీరై, కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పేలోపు జరగాల్సిన నష్టం జరిగిందని వాపోయారు. బాధితుడు పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తహశీల్దార్ రవికుమార్ అదేశాలతో డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ మహేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

బాధిత కుటుంబానికి జరిగిన నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంలో మొత్తం రూ.5.28 లక్షల నష్టం జరిగినట్లుగా అంచనా వేసినట్లుగా తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఒక బైక్,టివి, రెండు తులాల బంగారం,ఒక కులర్,నగదు రూ.50 వేలు,కిరాణ సామగ్రి రూ.50 వేలు విలువగలవి కాలిపోయిన్నట్లుగా బాధితుడు తెలిపాడు.బాధితుడు పిర్యాదు మేరకు కొయ్యుర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా..మరే కారణంతో అయిన జరిగిందా ఇంకా తెలియ రాలేదు.ఆర్థికంగా ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.



- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad