నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం జంబి హనుమాన్ దేవాలయం వద్ద దుకాణ సముదాయ (షేటర్స్ ) నిర్మాణం కొరకు బుధవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ పూజారి రమేష్ పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి భూమి పూజ చేశారు.దేవాలయానికి ఆదాయం సమకూర్చే సదుద్దేశంతో దుకాణ సముదాయం నిర్మాణానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వీటి నిర్మాణం కోసం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రజల నుండి విరాళాలను పోగు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్, బొగ రామస్వామి, సార్గాల రాజేశ్వర్, సుంకరి నవీన్, బద్దం రాజశేఖర్, సుభాష్ గౌడ్, పన్నాల రవీందర్, లక్ష్మీ నరసయ్య, డబ్బా రాజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
దుకాణ సముదాయ నిర్మాణానికి భూమి పూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



