Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెనిమెల్లలో లైబ్రేరియన్ ఏర్పాటుకు భూమిపూజ

పెనిమెల్లలో లైబ్రేరియన్ ఏర్పాటుకు భూమిపూజ

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల : ఉప్పునుంతల మండలంలోని పెనిమెల్ల గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో లైబ్రేరియన్ ఏర్పాటుకు గ్రామానికి చెందిన దాతలు ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన కీర్తిశేషులు మారం శశిరేఖమ్మ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని, వారి కుమార్తె పరిగి మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు హరీశ్వర్ రెడ్డి సతీమణి గిరిజా రెడ్డి లైబ్రేరియన్ ఏర్పాటుకు 4 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో మండల విద్యాధికారి చంద్రశేఖర్ సమక్షంలో భూమిపూజ నిర్వహించి, 4 లక్షల చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె సేవా భావాన్ని కొనియాడుతూ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గిరిజా రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు, మాజీ జడ్పీటీసీ నిరంజన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, మాజీ ఎంపీటీసీ బొల్లే వీరయ్య, మాజీ సర్పంచ్ గద్దల వీరయ్య, బొడ్డుపల్లి అంజి, పాఠశాల హెచ్ఎం నర్సింహ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఈ సేవా కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -