Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీపీ భవన నిర్మాణానికి భూమి పూజ 

జీపీ భవన నిర్మాణానికి భూమి పూజ 

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు
మండల పరిధిలోని మంగళ కుంట పల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి బుధవారం గ్రామంలో భూమి పూజ నిర్వహించారు. డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ  ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యము నిర్వహించినట్లు మండల అధ్యక్షులు వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధి పరచాలని లక్ష్యంతో ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే మంగళ కుంటపల్లి గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగినది తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వెంకటయ్య యాదవ్, ఉపాధ్యక్షులు మషన్న, మైలారం మాజీ సర్పంచ్ ఎల్లికంటి శ్రీనివాసులు, కొండారెడ్డిపల్లి సర్పంచ్ పంబ రాధాకృష్ణ, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రోడ్డ మహేష్, ఉప సర్పంచ్ శేఖర్, స్థలం దాతలు వెంకటేశ్వరరావు,కమలాకర్ రావు, లక్ష్మణ్ రావు, కృష్ణ రావు, సీనియర్ నాయకులు శ్రీనయ్య యాదవ్, తిరుపతయ్య, గణేష్, కృష్ణ యాదవ్, సుల్తాన్, పంచాయతీ కార్యదర్శి శివలీల మొదలైన  వారు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -