Sunday, April 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు హైకోర్ట్‌ భవనానికి శంకుస్థాపన

నేడు హైకోర్ట్‌ భవనానికి శంకుస్థాపన

- Advertisement -

– హాజరుకానున్న చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ హైకోర్ట్‌ భవనానికి ఆదివారం ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. శనివారం రాష్ట్రానికి చేరుకున్న చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు, హైకోర్ట్‌ న్యాయమూర్తి అపరేష్‌ కుమార్‌ సింగ్‌, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి ఇతర ప్రముఖులు సీజేకు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించారు. కాగా ముఖ్యమంత్రి సోమవారం బాసరకు వెళ్లనున్నట్టు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్థి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -