Monday, March 23, 2026
E-PAPER
Homeఆదిలాబాద్నూతన గ్రామపంచాయతీ భవనానికి  భూమి పూజ

నూతన గ్రామపంచాయతీ భవనానికి  భూమి పూజ

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్ : మండలంలోని జుమడా గ్రామమలో ఈ రోజు ఉపాధి హామీ నిధుల కింద 20 లక్షల నిధులు మంజూరు కావడంతో గ్రామపంచాయతీ భవనానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బషీర్ స్థానిక సర్పంచ్ అగ్గు మారుతి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని గ్రామాల అభివృద్ధికి  పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసి గ్రామాలను అభివృద్ధి పరిచేందుకు  ఎంతో కృషి చేయడం జరుగుతుందని  వారు చూపించారు. అదేవిధంగా  మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ  పనులు కొనసాగుతున్నప్పటికీ మళ్లీ రెండో విడతలు మరిన్ని ఇందిరమ్మ పథకాలు మంజూరు అయ్యేలా  కృషి చేస్తామని అన్నారు.

దీంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం  రైతులకు ఎకరానికి 6000 చొప్పున  రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు. మిగతా 45 రోజుల్లో పూర్తిస్థాయిలో రైతు భరోసా నిధులు  చేయడం జరుగుతుందని. వారు సూచించారు. ముఖ్యంగా గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూ దాత గోవింద్ సింగ్  గ్రామస్తులు మండల నాయకులు శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బంక బాబు శివాజీ. ఉప సర్పంచ్ శాంతాబాయి గ్రామస్తులు గౌతమ్ భగవాన్  గులాబ్ జీవన్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -