- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో బస్టాండ్ లేక ప్రయాణికుల ప్రయసాలకు గురివుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ సోమవారం బస్టాండ్ నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఓసిపి బ్లాక్-1 సిఎస్ఆర్ నిధులు రూ.10 లక్షల వ్యయంతో సబ్ స్టేషన్ ప్రక్కన, పాత తహసీల్దార్ కార్యాలయం వెనుక నూతన బస్టాండ్ నిర్మాణానికి భూమి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



