Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్హాసకొత్తూర్ లో షాదీఖానా నిర్మాణానికి భూమిపూజ

హాసకొత్తూర్ లో షాదీఖానా నిర్మాణానికి భూమిపూజ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాసకోతుర్ గ్రామంలో రూ.5లక్షలతో చేపడుతున్న షాదీఖానా నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో గురువారం భూమిపూజ చేశారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి కృషితో  జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క  నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ.5లక్షలు మంజూరు చేశారు. అట్టి నిధులతో చేపడుతున్న షాదీఖానా నిర్మాణానికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సుంకేట రవి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను చేపడుతుందన్నారు.  గ్రామంలో షాదీఖానా నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేసిన ముత్యాల సునీల్ రెడ్డికి  ముస్లిం సంఘ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో  కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్,  జిల్లా మైనార్టీ నాయకులు అబ్దుల్ రఫీ, గ్రామ శాఖ అధ్యక్షులు రేవతి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు గోపిడి లింగారెడ్డి, కుందేటి శ్రీనివాస్, మోహన్ నాయక్, ఏనుగు రాజేశ్వర్, ఏనుగు మనోహర్, ఎడ్ల శ్రీకాంత్, పెద్ది సృజన్, మండపల్లి మహేందర్, మోదిని శ్రీధర్, రాజేందర్, వేముల రవి, కాంగ్రెస్ నాయకులు, ముస్లిం సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad