- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని నాచారం గ్రామంలో లక్ష్మీదేవర ఆలయ నిర్మాణానికి శుక్రవారం అంగరంగవైభవంగా, వేదమంత్రాలతో భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, పాడిపంటలు బాగుండాలని లక్ష్మీ దేవర ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయడం జరిగిందని మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యూత్ నాయకులు, మహిళలు, గ్రామస్తులు తెలిపారు. ఆలయ నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.
- Advertisement -