Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సఖ్యత సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ

సఖ్యత సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ

- Advertisement -

– రూ.10 లక్షల ఎస్డిఎఫ్ నిధులతో భవన నిర్మాణం 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ గ్రామంలో సఖ్యత సంఘ భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ కృషితో ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి మంజూరు చేసిన రూ.10 లక్షలతో ఈ సఖ్యత సంఘ భవన నిర్మాణాన్ని చేపట్టారు. కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని సఖ్యత సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి, పనులను ప్రారంభించారు. సఖ్యత సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ కు సఖ్యత సంగం సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, డాక్టర్ మురళి, నర్రా భూమేష్, ఎన్నెల దేవేందర్, కస్తూరి శ్రీనివాస్, తోపారాం శ్రీనివాస్, సక్కరం నారాయణ, శ్రీరాముల సుమన్, బైకాన్ మహేష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad