నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో గురువారం రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో రాజ్యసభ సభ్యుడు కేతిరెడ్డి సురేష్ రెడ్డి నిధులతో చేపట్టనున్న రజక సంఘం ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజా చేశారు. సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ స్థానిక బిఆర్ఎస్ నాయకుల సమక్షంలో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసి, పనులను ప్రారంభించారు.
ఈ సందర్బంగా సర్పంచ్ హారిక అశోక్ మాట్లాడుతూ రజక సంఘ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.3లక్షల 50వేల రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అట్టినిధులతో ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డికి రజక సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అశోక్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొంటికంటి నరేందర్, నాయకులు అహ్మద్, మల్యాల సుభాష్ గౌడ్, బద్దం రాజశేఖర్, మహేందర్, బద్దం రాజేశ్వర్, నర్సయ్య, అక్షయ్, నాగేష్, భూమేశ్వర్, రజక సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



