నవతెలంగాణ – మల్హర్ రావు
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ స్పీకర్, అజాత శత్రువు, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి వేడుకలను పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలో గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహం ఏర్పాటు కోసం సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగారాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి హాజరై విగ్రహం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రాజిరెడ్డి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, ఇందారపు చెంద్రయ్య, సారయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశారపు చెంద్రయ్య, ప్రభాకర్, మధు, తాండ్ర మల్లేష్, మెరుగు రాజయ్య, దుర్గాప్రసాద్, రాగం రమేష్, ఆర్ని ఉదయ్, రణదీర్ పాల్గొన్నారు.



