– గ్రామదేవతలకు ఆలయ నిర్మిస్తున్న శేఖర్ గౌడ్
నవతెలంగాణ – కామారెడ్డి
జనగామ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణానికి బుధవారం రాజగౌని శేఖర్ గౌడ్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాన్ని 6 పిల్లర్లతో అద్భుతంగా నిర్మిస్తానని పేర్కొన్నారు. భూమి పూజ అనంతరం వెంటనే పనులను ప్రారంభించడం విశేషం. ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తానని ఆయన తెలిపారు. గ్రామాభివృద్ధి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు నిస్వార్థంగా చేస్తున్న ఈ సేవను గ్రామస్తులు అభినందించారు. రాజగౌని శేఖర్ గౌడ్ కు, వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.
జనగామలో ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణానికి భూమి పూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



