- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని బంజరుపల్లి గ్రామంలో గ్రామ సంఘం బిల్డింగుకు సోమవారం సర్పంచ్ రిక్కల లత రాజిరెడ్డి ఎంపీడీవో రమేష్ , ఏపీఎం తిరుపతి కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.10 లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి అన్ని రంగాలలో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డి ఈ మహేష్ ,సిసి బిక్షపతి, ఏ పీ ఓ పద్మ, ఏ ఈ రవిచంద్ర, పంచాయతీ కార్యదర్శి సతీష్ , విఓఏ మమత గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



