- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
మొల్గర గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో సర్పంచి సులోచనమ్మ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ శుక్రవారం వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి మాడుగుల రమేష్ ముఖ్య పాత్ర పోషించారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వార్డ్ సభ్యులు తప్పెట పర్వతాలు, హైమావతి పాల్గొన్నారు. నాయకులు సుమన్ రెడ్డి, పార్టీ ప్రెసిడెంట్ ఎల్ల గౌడ్, గ్రామ యువకులు, పలువురు గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- Advertisement -



