Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సమైక్య భవనానికి భూమి పూజ 

మహిళా సమైక్య భవనానికి భూమి పూజ 

- Advertisement -

నవతెలంగాణ – మర్రిగూడ
మండలంలో రాంరెడ్డి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తానేదారిపల్లిలో గ్రామంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుండి 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే మహిళ సమైక్య భవనానికి సోమవారం గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ పాలకవర్గ సభ్యులతో కలిసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మహిళా సమైక్య భవనాలు మహిళ సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

తమ గ్రామపంచాయతీ పరిధిలో మంజూరైన భవనాన్ని నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యత ప్రమాణాలతో  పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొగాకు పెద్ద సైదులు,ఏపీఎం అద్దంకి వెంకట్,పంచాయతీ కార్యదర్శి నజీరా,ఫీల్డ్ అసిస్టెంట్ సల్వోజ్ యాదయ్య,వార్డు మెంబర్లు లపంగి మహేందర్,డబ్బు యాదయ్య,నాగిళ్ల అంజమ్మ,వల్లపు హైమా భాస్కర్,పగిళ్ల యాదమ్మ,శంకర్,భీమనగోని మల్లన్న యాదయ్య,మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -