Friday, May 16, 2025
Homeఆటలుమైదానాలకు ఆకర్షితులు కావాలి

మైదానాలకు ఆకర్షితులు కావాలి

- Advertisement -

– శాట్‌ చైర్మెన్‌ కె.శివసేనా రెడ్డి
-1 నుంచి వేసవి శిక్షణా శిబిరాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌ :
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం పిల్లలతో పాటు తల్లిదండ్రులు మైదానాలకు ఆకర్షితులు కావాలని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌) చైర్మెన్‌ కె. శివసేనారెడ్డి అన్నారు. మే 1 నుంచి శాట్‌ వేసవి శిక్షణ శిబిరాలు ఆరంభం కానుండగా.. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డి, శాట్‌ వీసీ ఎండీ సోనీబాల దేవిలతో కలిసి ఎల్బీ స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సమ్మర్‌ క్యాంప్స్‌ పోస్టర్‌ను శివసేనా రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..’యువత క్రీడలపై ధ్యాస పెట్టడం సీఎం రేవంత్‌ రెడ్డి ఆలోచన. సీఎం ఆలోచనలకు అనుగుణంగా వేసవి శిక్షణ శిబిరాల్లో అందరూ పాల్గొనేలా రూపకల్పన చేశాం. పిల్లలతో పాటు తల్లిదండ్రులు మైదానాలకు ఆకర్షితులు కావాలి. శిక్షణకు వచ్చే పిల్లలకు తోడుగా వచ్చే తల్లిదండ్రులకు ఉచితంగా యోగా, జుంబా డాన్స్‌లో ట్రైనింగ్‌ ఇవ్వనున్నాం. ఈ ఏడాది అన్ని క్రీడాంశాల్లోనూ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని’ శివసేనా రెడ్డి తెలిపారు. వేసవి శిక్షణ శిబిరాల్లో సహాయక కోచ్‌ల వేతనాలను సైతం పెంచుతున్నట్టు శివసేన ప్రకటించారు. సహాయక కోచ్‌లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.5000, జిల్లా కేంద్రాల్లో రూ.7500, జంట నగరాల్లో రూ.15000 వేతనంగా ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు సహా హైదరాబాద్‌లోని స్టేడియాల్లో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌తో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ల్లో అడ్మిషన్‌ పొందవచ్చని, అన్ని కేంద్రాల్లో మే 1 నుంచి జూన్‌ 6 వరకు శిక్షణ శిబిరాలు జరుగుతాయని శివనసేనా రెడ్డి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -