నవతెలంగాణ – అశ్వారావుపేట: చరవాణి మొబైల్/సెల్ ఫోన్ కి ఛార్జింగ్ ఎంత అవసరమో భూగర్భ జలాలు రీఛార్జ్ కి కూడా ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం అంత అవసరమని డాక్టర్ పావని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో స్థానిక వ్యవసాయ కళాశాల బోధనా సిబ్బంది పర్యవేక్షణలో చేపట్టిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం శుక్రవారం మండలంలోని అల్లి గూడెం లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లా యాజమాన్యం ప్రోత్సహం తో ఇంకుడు గుంతలు తవ్వుకొని సాటి రైతుకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇందులో వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ కృష్ణ తేజ,వ్యవసాయ శాఖ మండల అధికారి శివ రామ్ ప్రసాద్ లు పాల్గొన్నారు. కార్యక్రమం లోని 6 ముఖ్యాంశాలను శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకి తెలియచేసారు.రైతులు తమ పంటలకు వాడుతున్న రసాయనాలు లేక ఎరువుల వివరాలు ఒక డైరీ లో రాసిపెట్టి,ఆ రసీదు ను భద్రపరుచుకుంటే భవిష్యత్ లో ఏమైనా ఇబ్బంది వస్తే పరిహారం పొందే అవకాశం ఉందని వారు తెలియచేసారు. ఒకసారి వ్యవసాయ కళాశాలకు వచ్చి అక్కడ ఉన్న పంటలు,సాంకేతికతను గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తర్ణాధికారి సతీష్, పంచాయతీ సెక్రటరీ స్వతంత్ర తేజ ముఖ్యులు గా హాజరు అయ్యారు.
ఇంకుడు గుంతలతోనే భూగర్భజలాల పెరుగుదల: డా.పావని
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES