Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌ పాలనలోనే గ్రూప్‌-1 నియామకాలు

కాంగ్రెస్‌ పాలనలోనే గ్రూప్‌-1 నియామకాలు

- Advertisement -

పదేండ్లలో నిరుద్యోగులను నిండా ముంచారు : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అప్పుడూ..ఇప్పుడూ.. కాంగ్రెస్‌ పాలనలోనే గ్రూప్‌-1 నియామకాలు జరిగాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గ్రూప్‌ వన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ శాఖలో జిల్లా రిజిస్ట్రార్‌లుగా నియమితులైన పలువురు అభ్యర్థులు మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ ఆంబేద్కర్‌ సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగులను బీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిండా ముంచిందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ హయాంలో 2011లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ చేయగా.. 2018లో భర్తీ ప్రక్రియ పూర్తయిందని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్‌ వివిద ఉద్యోగాలకు జారీ చేసిన నోటిఫికేషన్లను కావాలని గత సర్కార్‌ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

అలాంటి నాయకులు కాంగ్రెస్‌ పార్టీపై నేడు విమర్శలు చేయడం శోచనీయమన్నారు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, పేదలకు అండగా ఉండాలన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వాలతోనే సాధ్యమని పొంగులేటి స్పష్టం చేశారు. పదేండ్లలో టీజీపీఎస్పీని బీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గత సర్కార్‌ చేసిన పొరపాట్లకు తావులేకుండా అన్ని ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేస్తున్నామని గుర్తు చేశారు. రెండేండ్లలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డు సాధించామని పొంగులేటి తెలిపారు. ప్రభుత్వ విభాగాల్లో రిజిస్ట్రేషన్‌ శాఖ ముఖ్యమైందనీ, కొత్తగా ఈ శాఖలో చేరిన మీరు ప్రభుత్వ ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీతో, నిబద్దతతో విధులు నిర్వహించాలని వారికి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -