ఎంపికైన వారి జాబితా వైబ్‌సైట్‌లో ఉంచిన టీజీపీఎస్సీ
కోర్టు కేసు కారణంగా ఒక్క పోస్టు పెండింగ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్ 2 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మెన్ బుర్రా వెంకటేశం ఆదివారం విడుదల చేశారు. మొత్తం 783 పోస్టులకుగానూ ఎంపికైన 782 మంది జాబితాను వెల్లడించింది. ఒక్క పోస్టును కోర్టు కేసు కారణంగా పెండింగ్‌లో పెట్టారు. మొత్తం 18 క్యాటగిరీలకు సంబంధించి ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ 2024 డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితాను వెల్లడించింది. అభ్యర్థులను ఎంపిక చేసి ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు. తుది ప్రక్రియ ముగియడంతో ఈ గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన తుది ఫలితాలను విడుదల చేశారు.
గ్రూప్-2 ఫలితాలు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES