- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్-2 రాతపరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసింది. వివిధ పోస్టులకు అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు కూడా నమోదు చేశారు. దీంతో గ్రూప్-2 తుది ఫలితాలను ఆదివారం విడుదల చేయడానికి టీజీపీఎస్సీ సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్ 29న గ్రూప్-2 నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -