- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
చెట్లను పెంచడం వాటిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మద్నూర్ మండల అభివృద్ధి అధికారి రాణి అన్నారు. శుక్రవారం మద్నూర్ మండలంలోని హెచ్ కేలూర్ గ్రామాన్ని సందర్శించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఆ గ్రామంలో చెట్లకు నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెట్లను రక్షించడం వాటిని పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ జి లక్ష్మణ్, గ్రామ కార్యదర్శి షిండే విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



