Tuesday, October 14, 2025
E-PAPER
Homeజాతీయంజిఎస్‌టి సంస్కరణలతో వృద్ధి వేగవంతం : ప్రధాని మోడీ(LIVE)

జిఎస్‌టి సంస్కరణలతో వృద్ధి వేగవంతం : ప్రధాని మోడీ(LIVE)

- Advertisement -

నవతెలంగాణ – ఢిల్లీ :  జిఎస్‌టి సంస్కరణలు  వృద్ధిని వేగవంతం చేస్తాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.  ప్రధాని మోడీ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించారు.   2017లో జిఎస్‌టితో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అన్నారు. అంతకుమందు ఎన్నో పన్నులు ఉండేవని అన్నారు. ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లాలన్న పన్నులు కట్టాల్సి వుండేది. ఆ భారమంతా వినియోగదారులపై పడేది. రాష్ట్రాలన్నీ అభివృద్ధిలో దూసుకుపోతాయని అన్నారు.  పండగల సమయంలో దేశంలో అందరికీ మేలు జరుగుతుందని అన్నారు.  జిఎస్‌టి సంస్కరణలతో భారత వృద్ధి రేటు మరింత పెరుగుతుందని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆదాయం పెరుగుతుందని అన్నారు.  ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.   రేపటి నుండి జిఎస్‌టి సంస్కరణలు అమలు కానున్నసంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -