నవతెలంగాణ – హైదరాబాద్: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి GSLV-F16 స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. శాటిలైట్ NISARను 747కి.మి ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. NISAR శాటిలైట్ 12 రోజులకోసారి భూమిని చుట్టేస్తూ 3D చిత్రాలను అందిస్తుంది. భూమిని స్కాన్ చేస్తూ తుఫాన్లు, సునామీలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనం వంటి ప్రకృతి విపత్తులపై అలర్ట్ చేయనుంది. ఈ ఉపగ్రహం తయారీకి రూ.11,200 కోట్లు ఖర్చు చేశారు.
నిసార్ శాటిలైట్ (NISAR satellite) 2,393 కిలోల బరువుతో, భూమి నుంచి 743 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగనున్నది. ఇది ప్రతి 12 రోజులకు భూమిని క్షుణంగా పరిశీలించి అత్యంత కచ్చితత్వంతో; అధిక నాణ్యత, స్పష్టతలతో కూడిన ఛాయ చిత్రాలనూ, సమాచారాన్నీ ఆందిస్తుంది. ఇందులో నాసా (NASA) అభివృద్ధి చేసిన ఎల్–బ్యాండ్ ఎస్‌ఏఆర్, ఇస్రో (ISRO) రూపొందించిన ఎస్–బ్యాండ్ రాడార్లను కలిపిన డ్యూయల్ ఎస్‌ఏఆర్ సాంకేతికత ఉంది. ఇది పగలు, రాత్రి, వర్షం, పొగ, మేఘాలు వంటి ఏ పరిస్థితిలోనైనా స్పష్టమైన హై రిజల్యూషన్ డేటాను సేకరించగలదు.