నవతెలంగాణ-భువనగిరి: కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఫ్లెక్సీ పరిశ్రమపై జీఎస్టి పెంపును నిరసిస్తూ జిల్లా ఫ్లెక్స్ ప్రింటింగ్ ఓనర్స్ అసోసియేషన్ రెండు రోజుల బందుకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక రహదారి బంగ్లాలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెంచినందువల్ల ఫ్లెక్సీ మెటీరియల్ ఫ్లెక్సీ కలర్స్ మూడు సరుకులు రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి అన్నారు ఈ నెల 17 18 తేదీల్లో బందును ప్రకటించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కస్తూరి పాండు, గౌరవ అధ్యక్షులు కృష్ణ ఆనంద్ మోహన్ (టప్పు), జిల్లా ఉపాధ్యక్షులు పుప్పాల శ్రీకాంత్, మద్దూరి శ్రీకాంత్, కోశాధికారి గుమ్మడి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు గోపి కరుణాకర్, తాడూరి భాస్కర్, కటకం చంద్రశేఖర్, పుప్పాల మధు పాల్గొన్నారు.
ఫ్లెక్సీ పరిశ్రమపై జీఎస్టి పెంపు.. రెండు రోజులు ఫ్లెక్స్ ప్రింటింగ్ బంద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES