ఎంఆర్పిపై 13 శాతం తగ్గించి అమ్మడం లేదు
ప్యాకింగ్ వస్తువులపై తగ్గిన ధరల స్టిక్కరింగ్ లేదు
పెరిగిన బంగారం.. మూలిగే నక్కపై తాటి పండు
నవతెలంగాణ – ఆలేరు రూరల్
జీఎస్టీ తగ్గించాం.. దీపావళి ముందుగానే వచ్చింది. పండగ చేసుకోండి అంటూ కేంద్ర ప్రభుత్వం ఊదరగొట్టే ప్రకటనలు చేస్తుంది. కిరాణా షాపుల్లో మాత్రం తగ్గిన ధరలతో అమ్మే పరిస్థితి కనబడడం లేదు. సబ్బులు పేస్టులు షాంపూలు ఆయిల్ ప్యాకెట్స్ టీ పొడి ప్యాకెట్లు బిస్కెట్లు ఇలా వివిధ సైజుల్లో 300 నుండి 400 కు పైగా ప్యాకింగ్ వస్తువులు ఉంటాయి. పాత ధరలోనే అమ్మకాలు సాగుతున్నాయి. గురువారం నవతెలంగాణ పరిశీలన చేయగా తేలింది.
ఆలేర్ పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో కొలనుపాక శారాజీపేట గ్రామాల్లో కిరణ షాపుల్లో తగ్గిన ధరలతో అమ్మకాలు చేస్తున్న దాఖలాలు ఏ ఒక్క షాపులో లేదు. కిరాణా షాపు ల యజమానులతో తగ్గించి ఎందుకు అమ్మడం లేదని ప్రశ్నిస్తే.. పాత స్టాక్ అయిపోయే వరకు మేమేం చేయలేమని సమాధానం చెబుతున్నారు. కంపెనీల నుండి ధరలు తగ్గించి వచ్చిన తరువాత డిస్ట్రిబ్యూటర్ నుండి వచ్చే కొత్త సరుకు మాత్రమే జిఎస్టి తగ్గించి వస్తుందన్నారు. మా వద్ద ఉన్న స్టాక్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద జీఎస్టీ తగ్గక ముందే కొనుగోలు చేసిన వస్తువులని ప్రస్తుతం తగ్గించి అంతే మేము నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు. వాస్తవానికి డిస్టిబూటర్లు ప్రతి కిరణ షాపుకు వచ్చి ఆ సరుకుల మీద పాత రేట్లపై తగ్గిన జీఎస్టీ రేట్ల స్టిక్కరింగ్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. స్టిక్కరింగ్ చేసి కిరాణా షాపు వాళ్లకు రిటర్న్ డబ్బులు నష్టపోకుండా ఇవ్వాలి ఈ విషయాన్ని ఏ ఒక డిస్ట్రిబ్యూటర్ చేయడం లేదు. దీనితో పాత ధరలతోనే విక్రయిస్తున్నారు.
కిరాణా షాప్ యజమానులును వినియోగదారులు ధరలు తగ్గుతాయని ప్రభుత్వం చెప్పింది కదా అని ప్రశ్నిస్తే కొత్త స్టాక్ వచ్చాకే అని సరిది చెప్పి పాత రేట్లకి అమ్మకాలు చేస్తున్నారు. కొనుగోలను వాయిదా వేయలేక పండగ పూట వినియోగదారులు నష్టపోతున్నారు.
కార్లు ఏసీలు బైక్లు వాషింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ లాంటి వస్తువులు కు మాత్రమే జిఎస్టి తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీటి ధరలు లక్షల్లో వేళల్లో ఉంటాయి. కాబట్టి పర్సంటేజ్ ప్రకారం డిస్ట్రిబ్యూటర్ తీసివేసి అమ్మకాలు చేస్తున్నారు. ధనికులు ఎగువ మధ్య తరగతి వాళ్లకు తగ్గిన జిఎస్టి తో లాభం చేకూరుతుంది. నూటికి 85% గా ఉన్న పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది ఒక కిరాణా షాప్ లో 300 నుండి 400 రకాల ప్యాకింగ్ వస్తువులు ఉంటాయి. ప్రభుత్వం ముందు చూపు లేకుండా హుటాహుటిన దీపావళి ముందుగానే వచ్చిందని ఆర్భాటం ప్రకటన చేసి ఆచరణలో మాత్రం పర్యవేక్షించే యంత్రాంగం లేక ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకునే వారే లేకుండా పోయారు.
తగ్గిన జీఎస్టీ ని అమలుపరిచే యంత్రాంగం లేదు కంపెనీల ఓనర్లు డిస్ట్రిబ్యూటర్లు డీలర్లు కిరాణా షాపు యజమానులు అందరికీ ఏ సమస్య లేదు కాని వినియోదారులు మాత్రం నష్టపోవాల్సి వస్తుంది. దసరా పండుగకు ఒక కుటుంబం రూ.7000 ఖరీదు చేస్తే 900 నష్టపోవాల్సి వస్తుంది. పాత ధరలకు కొనడం వల్ల బట్టల షాపుల్లో కూడా ఇలాగే పరిస్థితి మరి దారుణంగా ఉంది. బ్రాండెడ్ పాయింట్లు షర్ట్లు, జీన్స్, టీషర్ట్స్, యజమానులు రెండు నెలల క్రితమే సరుకు ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నారు. ఇప్పుడు కంపెనీ లు సరుకుపై తగ్గిన జీఎస్టీ డబ్బులు రిటన్ ఇవ్వరు అట్లాగని సరుకు వాపస్ కూడా తీసుకోరు కొత్త స్టాక్ తెస్తే పాత స్టాక్ అలాగే మిగిలిపోతుంది. తగ్గించి అమ్మ లేక బట్టలు కూడా పాత రేట్లకే బట్టల షాపు యజమానులు అమ్ముతున్నారు.
ప్రధానమంత్రి మోడీ దీపావళి ముందుగానే వచ్చింది. పండగ చేసుకోండి అంటూ ప్రకటనలు ఇచ్చారు కానీ.. కిరాణా షాపులు బట్టల షాపులు హోటళ్లలో ఎక్కడ ధరలు తగ్గాయాని భూతద్దంతో వెతికిన కనబడడం లేదు. ఈ పరిస్థితి మరో నెల రోజులపాటు కొత్త స్టాకు వచ్చేవరకు ఇలాగే ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. 8 ఏళ్లుగా 18% జిఎస్టి తో దోపిడీ చేసిన కేంద్రం ఇప్పుడు 13 శాతం తగ్గించింది అని చెప్పడం ప్రధాని మోడీ 11 సంవత్సరాల పాలనలో పెద్ద జోక్ గా ప్రజలు చర్చించుకుంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు సేల్స్ టాక్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కిరణ షాపు యజమానులతో డిస్టిబూటర్లు కంపెనీలతో మాట్లాడి తగ్గిన ధరలు స్టిక్కరింగ్ చేయించాలని పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
జీఎస్టీ తగ్గించడం ఏమో కానీ మునిగే నక్కపై తాటి పండు పడ్డట్టు బంగారమైతే కొండెక్కి కూర్చుంది. సామాన్యులు పూస్తే మట్టెలు కూడా చేయించలేనంత ధరలు పెరిగాయి. తగ్గిన జీఎస్టీ ధరలతో పోల్చితే బంగారం పెరిగిన ధరతో బాంబేలు ఎత్తుతున్నారు. ధనికులు ఎగువ మధ్యతరగతి వాడే కార్లు బైక్లు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరల తగ్గుదల మాత్రం కనబడుతుంది. పేద మధ్యతరగతి ప్రజలు నూటికి 85% గా ఉంటారు. వీరికి తగ్గిన జీఎస్టీ వల్ల ఎలాంటి ఉపశమనం లభించిన పరిస్థితి కనబడడం లేదు. ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకుంటున్నట్లుగా ఉన్నాయి ప్రభుత్వ విధానాలు అంటూ ప్రజలు నిట్టూర్పుతో ఉన్నారు.