Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలి..

చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలి..

- Advertisement -

వృత్తి రక్షణకు పోరాటలే మార్గం..
చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి… గుండు వెంకట నర్సు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ / మోత్కూర్ 

కేంద్ర ప్రభుత్వ విధానాలతో చేనేత పరిశ్రమ మనుగడ ప్రశ్నర్ధకంగా మారిందని, చేనేత వస్త్రాలపై జీఎస్టీని 18 శాతం పెంచుతూ  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, చేనేత వృత్తి రక్షణకు కార్మికులు ఐక్యంగా పోరాటలకు సిద్ధం కావాలని చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున మోత్కూర్ లో చేనేత నాయకులతో కలిసి పత్రికా ప్రతినిధుల మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

వస్తుసేవల పన్ను (జీఎస్టీ ) తో విప్లవత్మాకమైన మార్పులను తెచ్చామని గొప్పలు చెపుతున్న కేంద్రంలోని  బీజేపీ సర్కార్,  కొత్త పన్నులతో సామాన్యుడి నడ్డి విరుస్తుందని, దేశంలో వ్యవసాయం తరువాత లక్షలాది మందికి జీవనాదారంగా ఉన్న చేనేత రంగంపై  మోడీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని ఆరోపించారు.  చేనేత వస్త్రాలపై 5 శాతం ఉన్న జీఎస్టీ  ని, ఏకంగా 18 శాతనికి పెంచి ఈ నెల 22 నుండి అమల్లోకి తేవాలనే నిర్ణయం  చేనేత పరిశ్రమ మనుగడే ప్రశ్నర్ధకంగా మారుతుందని అన్నారు. నూలు రంగుల రసాయనాల ధరలు పెరిగినప్పటికి, ఎంతో నాణ్యత  నైపుణ్యం కలిగిన పోచంపల్లి చేనేత  చీరలు దేశ విదేశాలలో ఎంతో ప్రచుర్యం పొంది  ఎన్నో అవార్డులు అందుకున్నారని తెలిపారు.

అలాంటి చేనేత వస్త్రాలపై జీఎస్టీ ని 18 శాతం పెంచి,  మిల్లులో తయారయ్యే  సింతటిక్ పాలిస్టర్ వంటి వస్త్రాలపై 12 శాతం నుండి 5 శాతానికి జిఎస్టి   తగ్గించిందని మండిపడ్డారు. నాశిరకం చీరెలు తక్కువ ధరలకు లభించడంతో వినియోగదారులు వాటినే కొనుగోలు చేస్తారని,  దీనితో  చేనేత వృత్తిపై  అదారపడి జీవిస్తున్న  లక్షలాది చేనేత కుటుంబాలు  ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే  చేనేత పై జీఎస్టీ ని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ రక్షణకు చేనేత కార్మికులు ఐక్య పోరాటలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు జెల్ల నాందేవ్, వడ్డెపెల్లి లక్ష్మణ్, జెల్ల సత్యనారాయణ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -