Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామాన్యుని జీవితంలో వెలుగులు నింపేందుకే జీఎస్టీ సంస్కరణలు 

సామాన్యుని జీవితంలో వెలుగులు నింపేందుకే జీఎస్టీ సంస్కరణలు 

- Advertisement -

భాగాల నవీన్ రెడ్డి 
నవతెలంగాణ-పాలకుర్తి

సామాన్యుని జీవితంలో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలను తీసుకువచ్చిందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో గల శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్ లో బిజెపి మండల అధ్యక్షుడు మారం రవికుమార్ ఆధ్వర్యంలో నెక్స్ట్ జెన్ జీఎస్టీ ప్రచార అభియాన్ నియోజకవర్గస్థాయి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ లో సమూల మార్పులను తీసుకువచ్చిందని తెలిపారు. 

పన్ను, స్లాబ్స్ తగ్గించి పేదలు, మద్యతరగతి, రైతులు, విద్యార్థులు అందరికీ ఉపయోగపడే  విధంగా సంస్కరణలు తీసుకురావడం అభినందనీయమన్నారు.ఈ నెక్స్ట్ జన్ జీఎస్టీ సంస్కరణల వల్ల పేదల జీవితాల్లో   దసరా, దీపావళి పండగల సందర్భంగా వెలుగులు నింపేందుకే జీఎస్టీ ని కానుకగా ఇచ్చేందుకు సంచలనాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ధేశ స్వాతంత్ర్యం అనంతరం  ఇప్పటి వరకూ దేశంలో 90శాతం ప్రజలు ఉపయోగించే వస్తువులపై పన్నులను తగ్గించడం ఇదే తొలిసారి అని అన్నారు. ఈసమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె కుమార్, జిల్లా కార్యదర్శి దుంపల సంపత్,, జిల్లా నాయకులు వడ్లకొండ రవి, శ్రీనివాస్ నాయక్,ముంజాల శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు పులిగిల్ల ఉపేందర్,పైండ్ల రాజేష్,గట్టు రాంబాబు,భాస్కరా చారి,బస్వ భాస్కర్,నర్సింహా చారి, వేల్పుల దేవరాజు,సోమేశ్వర్,ఈర్ల రాజు, లకావత్ రవి, గోనే అమరేందర్, గణేష్,నవీన్, సందీప్, శ్రీనాథ్, బెల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -