Friday, November 21, 2025
E-PAPER
Homeబీజినెస్ఇన్ఫోసిస్‌కు రూ.32వేల కోట్లజీఎస్టీ ఉపశమనం..!

ఇన్ఫోసిస్‌కు రూ.32వేల కోట్లజీఎస్టీ ఉపశమనం..!

- Advertisement -

బెంగళూరు : ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు ఇదివరకు జారీ చేసిన రూ.32,403 కోట్ల జీఎస్టీ నోటీసుకు సంబంధించి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ ఆ సంస్థకు ఉపశమనం కలిగించింది. 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ప్రీ షోకాజ్‌ నోటీసు ప్రొసీడింగ్స్‌ను మూసివేస్తున్నట్టు డీజీజీఐ నుంచి తమకు సమాచారం అందినట్టు ఇన్ఫోసిస్‌ తన రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 2017 నుంచి 2022 మధ్య ఇన్ఫోసిస్‌ విదేశీ శాఖల్లో జరిగిన వ్యయాలకు సంబంధించి రూ.32,403 కోట్ల జీఎస్టీ నోటీసును 2024 జులైలో డీజీజీఐ జారీచేసింది. దీనిపై వివరణ ఇవ్వడంతో డీజీజీఐ తన నోటీసులను రద్దు చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -